Wednesday 6 August 2014

ఓ ఆవరేజీ ప్రపంచం

                                     ఓ ఆవరేజీ ప్రపంచం  

ఏ  గొడవలు లేకుండా రోజులు ప్రశాంతంగా గడవాలని కోరుకునే సామాన్యులనూ 
నెలకు కనీసం ఒక కేసు లేకపోతే చాల కష్టం ఇక నివే దిక్కని వేడుకునే వకిల్ల్లనూ 


 వ్యాధుల భారి నుండి మమ్మల్ని  కాపాడమని ఆరోగ్యంగా పూర్ణష్యుతో దీవించమని మొక్కుకునే 
  రోగులనీ 
అందరూ రావాలనే ఆసుపత్రి పెట్టింది ఎవరూ రాకపోతే  ఇక ఇదెందుకు  నేనెందుకు అని వాపోయే 
 వైద్యులనూ 


మేం కష్టపడి సంపాదించింది మాకే దక్కాలని వ్రతాలు చేసే వ్యాపారులనూ 
మొన్న తేచ్చిందంట్లో  సగం కంటే ఎక్కువగా పోలిసులకే పోయింది  కనీసం  ఈరోజైనా పని 
పూర్తయ్యేలా చూడమని దక్షనలిచ్చుకునే దొంగలనూ 

మనశ్యాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం ప్రార్థించే భక్తులను మత ప్రవక్తలను 
ఎలాగైనా మా పవిత్ర యుద్ధం గెలవాలని కోరే క్రురులనూ 

ఇలా అందరినీ దేవుడు చాల చిత్రంగా సమానంగా ఆశిర్వాదిస్తున్నడనుకుంట 

  అందుకే  ఈ ప్రపంచం  ఆరోగ్యానికి  అనారోగ్యానికి మధ్య 
                                  నైతికతకు అనైతికతకు  మధ్య
                                  నీతికి  అవినీతికీ   మధ్య
                                  యుద్ధానికి శాంతికి  మధ్య

       అద్వానానికి  ఆదర్శానికి మధ్య నలుగుతూ  మూలుగుతూ ఎప్పుడూ అవరేజి గానే ఉంది ఉంటుంది కూడా  ఏమంటారు ?